కంటెంట్‌కు వెళ్లండి
సామెతలు 3:5-12

యెహోవాను నమ్ముము

సామెతలు 3:5-12
5
నీ హృదయమంతటితో యెహోవాపై నమ్మకముంచు నీ సొంత తెలివిని ఆధారం చేసుకోవద్దు;
6
నీ మార్గాలన్నిటిలో ఆయనను గుర్తించు, అప్పుడు ఆయన నీ త్రోవలను తిన్నగా చేస్తారు.
7
నీకు నీవే తెలివైన వానినని అనుకోవద్దు; యెహోవా పట్ల భయభక్తులు కలిగి చెడును విడిచిపెట్టు.
8
అప్పుడు నీ శరీరానికి ఆరోగ్యం, నీ ఎముకలకు బలం కలుగుతుంది.
9
నీ ధనముతో, నీ పంటలో ప్రథమ ఫలముతో యెహోవాను ఘనపరచు;
10
అప్పుడు నీ ధాన్యాగారాలు నిండి సమృద్ధిగా ఉంటాయి, నీ గానుగ తొట్టెలు క్రొత్త ద్రాక్షరసంతో పొంగిపొర్లుతాయి.
11
నా కుమారుడా, యెహోవా క్రమశిక్షణను తృణీకరించవద్దు ఆయన గద్దింపును అసహ్యించుకోవద్దు.
12
ఎందుకంటే తండ్రి తన కుమారునిలో ఆనందించునట్లు, యెహోవా తాను ప్రేమించేవారిని క్రమశిక్షణలో ఉంచుతారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options