Skip to content
సామెతలు 12:5-11

సామెతలు 12:5-11

5
నీతిమంతుల ఆలోచనలు న్యాయమైనవి దుష్టుల సలహాలు మోసకరమైనవి.
6
దుష్టుల మాటలు ఒక హత్యకు పొంచి ఉన్న వారి లాంటివి, యథార్థవంతుల మాటలు వారిని విడిపిస్తాయి.
7
దుష్టులు చనిపోయి కనుమరుగవుతారు, అయితే నీతిమంతుల ఇల్లు స్థిరంగా నిలుస్తుంది.
8
మనుష్యులు తన వివేకాన్ని బట్టి పొగడబడతాడు, అలాగే వికృతమైన మనస్సు కలవారు తిరస్కరించబడతారు.
9
ఏమీ కాకపోయినా ఏదో గొప్పవానిగా నటిస్తూ ఆహారం కూడా లేని వానికంటె ఏమీ కాని వాడైనా ఒక సేవకుని కలిగి ఉన్నవాడు మేలు.
10
నీతిమంతులు తన పశువులను జాగ్రత్తగా చూసుకుంటారు, కానీ దుష్టులు చేసే అత్యంత జాలిగల పనులు కౄరంగా ఉంటాయి.
11
తమ భూమిలో పని చేసేవారికి ఆహారం సమృద్ధిగా ఉంటుంది, కానీ పగటి కలల వెంటపడేవారికి బుద్ధి ఉండదు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options