Skip to content
సంఖ్యాకాండము 6:13-21

సంఖ్యాకాండము 6:13-21

13
“ ‘ప్రత్యేకించుకున్న కాలం ముగిసినప్పుడు నాజీరు పాటించవలసిన నియమమేదంటే వారు సమావేశ గుడారం ద్వారం దగ్గరకు రావాలి.
14
అక్కడ వారు యెహోవాకు తమ అర్పణలు అర్పించాలి: దహనబలి కోసం లోపం లేని ఏడాది మగ గొర్రెపిల్ల, పాపపరిహారబలి కోసం లోపం లేని ఆడ గొర్రెపిల్ల, సమాధానబలి కోసం లోపం లేని పొట్టేలు,
15
వీటితో పాటు భోజనార్పణలు, పానార్పణలు, ఒక గంపెడు నూనె కలిపిన పులుపు కలపకుండ చేసిన నాణ్యమైన పిండి వంటలు ఒలీవనూనె కలిపిన మందమైన రొట్టెలు, ఒలీవనూనె పూసిన అప్పడాలు తీసుకురావాలి.
16
“ ‘ఇవన్నీ యాజకుడు యెహోవా ఎదుట ఉంచి పాపపరిహారబలి, దహనబలి అర్పించాలి.
17
అతడు గంపెడు పులియని రొట్టెలతో పాటు పొట్టేలును భోజనార్పణ పానార్పణంతో పాటు యెహోవాకు సమాధానబలిగా అర్పించాలి.
18
“ ‘అప్పుడు సమావేశ గుడారం ద్వారం దగ్గర, నాజీరు తాను ప్రత్యేకించుకున్న దానికి చిహ్నంగా ఉన్న తల వెంట్రుకలను గొరిగించుకోవాలి. ఆ వెంట్రుకలు సమాధానబలి అగ్నిలో వేసేయాలి.
19
“ ‘నాజీరు తాను ప్రత్యేకించుకున్న దానికి చిహ్నంగా ఉన్న తల వెంట్రుకలను గొరిగించుకున్న తర్వాత వండిన పొట్టేలు జబ్బను, గంపలోని ఒక పులుపు కలపకుండ చేసిన మందమైన రొట్టెను, ఒక అప్పడాన్ని యాజకుడు నాజీరు చేయబడిన వాని చేతిలో పెట్టాలి.
20
యాజకుడు అప్పుడు వాటిని యెహోవా ఎదుట పైకెత్తి ప్రత్యేక అర్పణగా అర్పించాలి; పైకెత్తబడి అర్పించబడిన రొమ్ము, ప్రత్యేక అర్పణగా సమర్పించబడిన తొడ పరిశుద్ధమైనవి, అవి యాజకునికి చెందినవి. ఆ తర్వాత, నాజీరు చేయబడిన వాడు ద్రాక్షరసం త్రాగవచ్చు.
21
“ ‘తాము ప్రత్యేకించుకున్న దాని ప్రకారం యెహోవాకు అర్పణలను తెస్తామని మ్రొక్కుబడి చేసే నాజీరుల నియమము. వారు తేగలిగితే అధనపు అర్పణలను కూడా తీసుకురావచ్చు. నాజీరు నియమం ప్రకారం వారు చేసిన మ్రొక్కుబడులను వారు తప్పక నెరవేర్చాలి.’ ”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options