Skip to content
సంఖ్యాకాండము 28:11-15

అమావాస్య అర్పణ

సంఖ్యాకాండము 28:11-15
11
“ ‘ప్రతి నెల మొదటి రోజు యెహోవాకు లోపం లేని రెండు కోడెలు, ఒక పొట్టేలు, యేడు ఏడాది మగ గొర్రెపిల్లలు దహనబలిగా అర్పించాలి.
12
ప్రతి కోడెతో పాటు ఒలీవనూనె కలిపిన మూడు ఓమెర్ల నాణ్యమైన పిండితో భోజనార్పణ ఉండాలి; పొట్టేలుతో పాటు, నూనె కలిపిన రెండు ఓమెర్ల నాణ్యమైన పిండి భోజనార్పణగా ఉండాలి;
13
అలాగే ప్రతి గొర్రెపిల్లతో పాటు, నూనె కలిపిన ఒక ఓమెరు నాణ్యమైన పిండిని భోజనార్పణగా సమర్పించాలి. ఇది దహనబలి, యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగించే హోమబలి.
14
ప్రతి కోడెతో పాటు పానార్పణగా అర హిన్ ద్రాక్షరసం ఉండాలి; పొట్టేలుతో పాటు, హిన్‌లో మూడవ వంతు ద్రాక్షరసం; ప్రతి గొర్రెపిల్లతో పాటు ఒక పావు హిన్ ద్రాక్షరసం అర్పించాలి. సంవత్సరంలో ప్రతి అమావాస్యకు అర్పించాల్సిన దహనబలి ఇది.
15
క్రమం తప్పకుండ అర్పించే దహనబలి, దాని పానార్పణంతో పాటు, యెహోవాకు పాపపరిహారబలిగా ఒక మేకపోతును అర్పించాలి.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options