Skip to content
సంఖ్యాకాండము 18:25-31

సంఖ్యాకాండము 18:25-31

25
యెహోవా మోషేతో ఇలా అన్నారు:
26
“లేవీయులతో మాట్లాడుతూ ఇలా చెప్పు: ‘మీరు ఇశ్రాయేలీయుల నుండి వారసత్వంగా దశమభాగం తీసుకున్నప్పుడు, ఆ దశమభాగంలో పదవ వంతు మీరు యెహోవాకు అర్పణగా సమర్పించాలి.
27
అలా ప్రత్యేకించిన అర్పణలు నూర్పిడి కళ్ళంలోని ధాన్యంలా, గానుగ నుండి వచ్చిన ద్రాక్షరసంలా లెక్కకు వస్తాయి.
28
ఇశ్రాయేలీయుల నుండి పుచ్చుకొనే దశమ భాగాలన్నిటి నుండి యెహోవాకు మీరు కూడా అర్పణలు ఇస్తారు. ఈ దశమ భాగాల నుండి యెహోవా భాగమును యాజకుడైన అహరోనుకు ఇవ్వాలి.
29
మీకు ఇవ్వబడిన ప్రతి దానిలో ఉత్తమమైన పవిత్రమైన భాగాన్ని మీరు యెహోవా యొక్క భాగంగా సమర్పించాలి.’
30
“లేవీయులకు చెప్పు: ‘శ్రేష్ఠమైనవి అర్పించినప్పుడు, అవి మీ నూర్పిడి కళ్ళంలా, ద్రాక్ష గానుగలా లెక్కకు వస్తాయి.
31
మిగితా వాటిని మీరు, మీ ఇంటివారు ఎక్కడైనా తినవచ్చు అది సమావేశ గుడారంలో మీరు చేస్తున్న సేవకు మీ జీతము.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options