20
యెహోవా అహరోనుతో ఇలా చెప్పారు, “వారి దేశంలో నీకు స్వాస్థ్యం కానీ వాటా కానీ ఉండదు; ఇశ్రాయేలీయుల మధ్య నేనే నీ వాటాను నేనే నీ స్వాస్థ్యాన్ని.
21
“సమావేశ గుడారం దగ్గర సేవ చేస్తున్న లేవీయులకు పారితోషికంగా ఇశ్రాయేలీయులు ఇచ్చే దశమ భాగాలను స్వాస్థ్యంగా ఇస్తున్నాను.