Skip to content
నెహెమ్యా 6:17-19

అంతర్గత ద్రోహం కొనసాగుట

నెహెమ్యా 6:17-19
17
ఆ రోజుల్లో యూదా సంస్థానాధిపతులు టోబీయాకు పదే పదే ఉత్తరాలు పంపుతూ ఉండేవారు. టోబీయా కూడా వారికి జవాబులు పంపేవాడు.
18
అతడు ఆరహు కుమారుడైన షెకన్యాకు అల్లుడు. అంతే కాకుండా అతని కుమారుడైన యెహోహనాను బెరెక్యా కుమారుడైన మెషుల్లాము కుమార్తెను పెళ్ళి చేసుకున్నాడు. కాబట్టి యూదా వారిలో చాలామంది అతనికి విధేయులుగా ఉంటామని ప్రమాణం చేశారు.
19
అంతేకాక వారు నా దగ్గరకు వచ్చి అతని గురించి పొగుడుతూ నేను చెప్పేవాటన్నిటిని అతనికి చేరవేసేవారు. నన్ను బెదిరించడానికే టోబీయా ఉత్తరాలు పంపేవాడు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options