లేవీయకాండము 8:26-27
26
యెహోవా ఎదుట ఉన్న పులియని రొట్టెల గంపలో నుండి ఒక మందమైన రొట్టెను, ఒలీవనూనె కలిపి చేసిన ఒక మందమైన రొట్టెను, ఒక పల్చని రొట్టెను తీసుకుని, ఆ క్రొవ్వు మీద, కుడి తొడ మీద ఉంచాడు.
27
అవన్నీ అహరోను, అతని కుమారుల చేతుల్లో పెట్టగా, వారు యెహోవా ఎదుట వాటిని పైకెత్తి ప్రత్యేక అర్పణగా అర్పించారు.