Skip to content
లేవీయకాండము 23:34-38

లేవీయకాండము 23:34-38

34
“ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఏడవ నెల పదిహేనవ రోజున యెహోవా యొక్క గుడారాల పండుగ ప్రారంభమవుతుంది, అది ఏడు రోజులు ఉంటుంది.
35
మొదటి రోజు పరిశుద్ధ సభ నిర్వహించాలి; ఆ రోజు జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు.
36
ఏడు రోజులు యెహోవాకు హోమబలులు అర్పించాలి, ఎనిమిదవ రోజు పరిశుద్ధ సభ నిర్వహించి యెహోవాకు హోమబలి అర్పించాలి. అది ప్రత్యేక సభ ముగింపు; అప్పుడు జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు.
37
“ ‘ఇవి యెహోవా నియమించబడిన పండుగలు, వీటిని యెహోవాకు హోమబలులు, దహనబలులు, భోజనార్పణలు, బలులు, పానార్పణలు తీసుకురావడానికి పరిశుద్ధ సభలుగా మీరు ప్రకటించాలి. ఏ రోజు అర్పణ ఆ రోజు తీసుకురావాలి.
38
ఇవి యెహోవా సబ్బాతులకు, మీ బహుమానాలకు, మ్రొక్కుబడులకు, యెహోవాకు అర్పించే స్వేచ్ఛార్పణలన్నిటికి అధనంగా అర్పించవలసిన అర్పణలు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options