Skip to content
లేవీయకాండము 23:16-22

లేవీయకాండము 23:16-22

16
ఏడవ సబ్బాతు దినానికి సరిగ్గా యాభై రోజులు లెక్కించాలి, అప్పుడు యెహోవాకు క్రొత్త ధాన్య అర్పణ అర్పించాలి.
17
మీరు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడినుండి, రెండు ఓమెర్ల నాణ్యమైన పిండితో రెండు రొట్టెలను పులిసిన దానితో కాల్చి, యెహోవాకు అర్పించే ప్రథమ ఫలాల ప్రత్యేక అర్పణగా తీసుకురండి.
18
ఈ రొట్టెతో పాటు లోపం లేని ఏడు ఏడాది మగ గొర్రెపిల్లలను, ఒక చిన్న ఎద్దును, రెండు పొట్టేళ్లను సమర్పించాలి. భోజనార్పణలు, పానార్పణలతో పాటు అవి యెహోవాకు దహనబలిగా ఉంటాయి, అది యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి.
19
పాపపరిహారబలి కోసం మేకపోతును, సమాధానబలిగా రెండు ఏడాది మగ గొర్రెపిల్లను అర్పించాలి.
20
యాజకుడు రెండు గొర్రెపిల్లలను ప్రథమ ఫలాల రొట్టెలతో పాటు యెహోవా ఎదుట పైకెత్తి ప్రత్యేక అర్పణగా అర్పించాలి. అవి యాజకుని కోసం యెహోవాకు అర్పించే పరిశుద్ధ అర్పణలు.
21
అదే రోజు పరిశుద్ధ సభను ప్రకటించాలి, జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు. మీరెక్కడున్నా ఇది రాబోయే తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది.
22
“ ‘మీరు మీ భూమి యొక్క పంటను కోసినప్పుడు, మీ పొలం అంచుల మట్టుకు కోయకండి లేదా మీ పంట కోతలను సేకరించకండి. పేదల కోసం, మీ మధ్య నివసించే విదేశీయుల కోసం వాటిని వదిలేయండి. నేను మీ దేవుడనైన యెహోవాను.’ ”

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.

Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options