Skip to content
లేవీయకాండము 18:24-30

దేశమును అపవిత్రపరచుటవలన కలుగు ఫలితాలు

లేవీయకాండము 18:24-30
24
“ ‘వీటిలో దేని ద్వారానైన మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోవద్దు, ఎందుకంటే మీ ముందు నుండి నేను వెళ్లగొట్టే దేశాల ప్రజలు ఇలాంటి వాటి వల్లనే అపవిత్రమయ్యారు.
25
ఆ దేశం కూడ అపవిత్రమైంది; కాబట్టి దాని పాపాన్ని బట్టి దాన్ని శిక్షించాను, ఆ దేశం తనలో నివసించేవారిని బయటికి వెళ్లగ్రక్కుతుంది.
26
కానీ మీరు నా శాసనాలను నా చట్టాలను పాటించాలి. మీలో నివసించే స్వదేశీయులు గాని విదేశీయులు గాని ఈ హేయమైన పనులేవి చేయకూడదు.
27
ఎందుకంటే ఆ దేశంలో మీకంటే ముందు అక్కడ నివసించిన ప్రజలు ఇవన్నీ చేయడం వలన ఆ దేశం అపవిత్రమైంది.
28
మీరు దేశాన్ని అపవిత్రం చేస్తే, అది ముందున్న జనాలను బయటికి వెళ్లగ్రక్కినట్లు మిమ్మల్ని కూడ వెళ్లగ్రక్కుతుంది.
29
“ ‘ఎవరైనా ఇలాంటి హేయమైన కార్యాలు చేస్తే వారు ప్రజల్లో నుండి తొలగించబడతారు.
30
నేను మీకు చెప్పినవి పాటించి, అక్కడ మీకన్నా ముందు నివసించినవారు పాటించిన హేయమైన ఆచారాల్లో దేనినైనా పాటించి వాటివలన మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోకండి. నేను మీ దేవుడనైన యెహోవాను.’ ”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options