లేవీయకాండము 18:21-25
21
“ ‘మీ పిల్లల్లో ఎవరినీ మోలెకుకు బలి ఇవ్వవద్దు, ఎందుకంటే మీరు మీ దేవుని పేరును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను.
22
“ ‘స్త్రీతో ఉన్నట్లు పురుషునితో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు; అది అసహ్యకరమైనది.
23
“ ‘జంతువుతో లైంగిక సంబంధం పెట్టుకుని మిమ్మల్ని మీరు దానితో అపవిత్రం చేసుకోవద్దు. జంతువు స్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకునేలా ఆమె దాని ముందు నిలబడకూడదు; అది విపరీతము.
24
“ ‘వీటిలో దేని ద్వారానైన మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోవద్దు, ఎందుకంటే మీ ముందు నుండి నేను వెళ్లగొట్టే దేశాల ప్రజలు ఇలాంటి వాటి వల్లనే అపవిత్రమయ్యారు.
25
ఆ దేశం కూడ అపవిత్రమైంది; కాబట్టి దాని పాపాన్ని బట్టి దాన్ని శిక్షించాను, ఆ దేశం తనలో నివసించేవారిని బయటికి వెళ్లగ్రక్కుతుంది.
Settings