- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
లేవీయకాండము 15:19-33
19
“ ‘ఒక స్త్రీకి నెలసరి సమయంలో రక్తస్రావం జరిగినప్పుడు ఆమె నెలసరి అపవిత్రత ఏడు రోజులు ఉంటుంది, ఆమెను తాకిన వారెవరైనా సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటారు.
20
“ ‘నెలసరి సమయంలో ఆమె దేనిపై పడుకుంటుందో అది అపవిత్రం అవుతుంది, ఆమె దేనిపై కూర్చుంటుందో అది అపవిత్రం అవుతుంది.
21
ఆమె పడకను తాకినవారు అపవిత్రులవుతారు; వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, నీటితో స్నానం చేయాలి, వారు సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉంటారు.
22
ఆమె కూర్చున్న దాన్ని తాకినవారు అపవిత్రులవుతారు; వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, నీటితో స్నానం చేయాలి, వారు సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉంటారు.
23
ఆమె పడకను గాని ఆమె కూర్చున్న దానిని గాని తాకినవారు సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉంటారు.
24
“ ‘ఒక వ్యక్తి ఆమెతో లైంగికంగా కలిసినప్పుడు ఆమె నెలసరి అతన్ని తాకితే, అతడు ఏడు రోజులు అపవిత్రునిగా ఉంటాడు; అతడు పడుకున్న ఏ పడకయైనా అపవిత్రమవుతుంది.
25
“ ‘ఒక స్త్రీకి తన నెలసరి సమయం కాకుండా చాలా రోజులు రక్తస్రావం జరిగినా లేదా ఆమె నెలసరి వ్యవధి మించి రక్తస్రావం కొనసాగితే, రక్తస్రావం ఉన్నంత వరకు నెలసరి రోజుల్లా ఆమె అపవిత్రంగా ఉంటుంది.
26
ఆమెకు రక్తస్రావం కొనసాగుతున్నప్పుడు ఆమె పడుకున్న ఏ పడకైనా ఆమె నెలసరి సమయంలో ఉన్నప్పటిలాగే ఆ పడక అపవిత్రం, అలాగే ఆమె దేనిపై కూర్చున్న అది అపవిత్రం అవుతుంది.
27
వాటిని తాకినవారు అపవిత్రులు; వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, నీటితో స్నానం చేయాలి, వారు సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉంటారు.
28
“ ‘ఆమె స్రావం నుండి శుద్ధి చేయబడినప్పుడు, ఆమె ఏడు రోజులు లెక్కించి అవి ముగిసిన తర్వాత ఆమె పవిత్రమవుతుంది.
29
ఎనిమిదవ రోజున ఆమె రెండు గువ్వలను గాని, రెండు పావురం పిల్లలను గాని తీసుకువచ్చి సమావేశ గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర యాజకునికి ఇవ్వాలి.
30
యాజకుడు వాటిలో ఒకదాన్ని పాపపరిహారబలిగా ఒకదాన్ని దహనబలిగా అర్పించాలి. ఈ విధంగా యాజకుడు స్త్రీకి స్రావం ద్వార కలిగిన అపవిత్రతకు యెహోవా ఎదుట ప్రాయశ్చిత్తం చేయాలి.
31
“ ‘తమను అపవిత్రం చేసే వాటినుండి మీరు ఇశ్రాయేలీయులను దూరంగా ఉంచాలి, తద్వార వారి మధ్య ఉన్న నా నివాస స్థలాన్ని వారు అపవిత్రం చేసినందుకు వారి అపవిత్రతలో వారు చావరు.’ ”
32
ఈ నియమాలు స్రవిస్తున్న వ్యక్తికి వీర్యస్కలనం వలన అపవిత్రమైన వారికి ఈ నియమాలు వర్తిస్తాయి.
33
తన నెలసరి సమయంలో ఉన్న ఒక స్త్రీకి, స్రవిస్తున్న పురుషునికి గాని స్త్రీకి గాని, అపవిత్రురాలైన స్త్రీతో లైంగికంగా కలిసిన పురుషునికి వర్తిస్తాయి.
Settings