లేవీయకాండము 14:10-19
10
“ఎనిమిదవ రోజు ఏ లోపం లేని రెండు మగ గొర్రెపిల్లలను, ఏ లోపం లేని ఏడాది ఆడ గొర్రెపిల్లను, రెండు కూడా ఏ లోపం లేనివాటిని తీసుకురావాలి. భోజనార్పణ కోసం నూనె కలిపిన మూడు ఓమెర్ల నాణ్యమైన పిండి, ఒక సేరు నూనె యాజకుని దగ్గరకు తీసుకురావాలి.
11
వారిని శుద్ధులుగా ప్రకటించే యాజకుడు శుద్ధీకరించబడిన వారిని, వారి అర్పణలతో పాటు సమావేశ గుడారం యొక్క ద్వారం దగ్గర యెహోవా ఎదుట కనుపరచాలి.
12
“అప్పుడు యాజకుడు మగ గొర్రెపిల్లలలో ఒకదాన్ని తీసుకుని, అపరాధపరిహారబలిగా, కొంచెం నూనెతో పాటు అర్పించాలి; అతడు వాటిని పైకెత్తి యెహోవా ఎదుట ప్రత్యేక అర్పణగా అర్పించాలి.
13
అతడు పాపపరిహారబలిని, దహనబలిని వధించే పరిశుద్ధాలయ ప్రాంతంలో గొర్రెపిల్లను వధించాలి. పాపపరిహారబలిలా, అపరాధపరిహారబలి కూడా యాజకునికే చెందుతుంది; అది అతిపరిశుద్ధము.
14
యాజకుడు అపరాధపరిహారబలి పశువు రక్తాన్ని కొంచెం తీసుకుని శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తి యొక్క కుడిచెవి కొన మీద, వారి కుడిచేతి బొటనవ్రేలుపై, వారి కుడికాలి బొటనవ్రేలుపై పూయాలి.
15
అప్పుడు యాజకుడు కొంచెం నూనె తీసుకుని, తన ఎడమచేతి అరచేతిలో పోసి,
16
తన కుడి చూపుడు వ్రేలు తన అరచేతిలో ఉన్న నూనెలో ముంచి, తన వ్రేలితో దానిలో కొంచెం యెహోవా ఎదుట ఏడుసార్లు చిలకరిస్తాడు.
17
యాజకుడు తన అరచేతిలో మిగిలి ఉన్న నూనెలో కొంచెం శుద్ధి చేయబడవలసిన వ్యక్తి యొక్క కుడిచెవి యొక్క లోలాకుల మీద, వారి కుడిచేతి బొటనవ్రేలుపై, వారి కుడి పాదం యొక్క పెద్ద బొటనవ్రేలుపై, అపరాధపరిహారబలి పశువు రక్తం పైన ఉంచాలి.
18
యాజకుడు తన అరచేతిలో మిగిలి ఉన్న నూనెను శుద్ధీకరణ కోసం వచ్చిన వారి తలమీద పూసి యెహోవా ఎదుట ప్రాయశ్చిత్తం చేయాలి.
19
“అప్పుడు యాజకుడు అపవిత్రత పోగొట్టుకోవాలని వచ్చిన వారి కోసం పాపపరిహారబలి అర్పించి ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత దహనబలి పశువును వధించాలి.
Settings