న్యాయాధిపతులు 16:4-6
4
కొంతకాలం తర్వాత అతడు శోరేకు లోయకు చెందిన దెలీలా అనే స్త్రీని ప్రేమించాడు.
5
ఫిలిష్తీయుల నాయకులు ఆమె దగ్గరకు వెళ్లి, “మేము అతన్ని కట్టిపడేసి లొంగదీసుకోడానికి నీవు అతన్ని ఆకర్షించుకుని అతని గొప్ప బలం యొక్క రహస్యం ఏమిటో, అతన్ని మేము ఎలా గెలవగలమో తెలుసుకో! అప్పుడు మాలో ప్రతి ఒక్కరూ నీకు పదకొండు వందల వెండి షెకెళ్లు ఇస్తాం” అని అన్నారు.
6
కాబట్టి దెలీలా సంసోనుతో, “నీ గొప్ప బలం యొక్క రహస్యం ఏంటో నాకు చెప్పవా, నిన్ను కట్టి లోబరుచుకోవడం ఎలా?” అని అడిగింది.
Settings