యెహోషువ 9:2
చుట్టుపక్కల సందర్భంతో వచనం 2 చూపబడుతోంది.
1
యొర్దానుకు పశ్చిమాన ఉన్న రాజులందరూ అంటే కొండ సీమలోని రాజులు, పడమటి పర్వత ప్రాంతాల్లో, మధ్యధరా సముద్ర తీరప్రాంతంలో లెబానోను వరకు ఉన్న హిత్తీయులు, అమోరీయులు, కనానీయుల, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయుల రాజులు ఈ విషయాలను గురించి విన్నప్పుడు,
2
వారు యెహోషువతో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి కలిసి వచ్చారు.
3
అయితే, యెరికోకు, హాయికి యెహోషువ ఏమి చేశాడో గిబియోను ప్రజలు విన్నప్పుడు,
4
వారు ఒక కుయుక్తిని ఆలోచించి, రాయబారులుగా నటిస్తూ తమ గాడిదల మీద చినిగిపోయిన గోనెసంచులు, పాతగిల్లి అతుకు వేసిన ద్రాక్షతిత్తులను పెట్టుకుని వెళ్లారు.
5
తమ కాళ్లకు అరిగిపోయి అతుకులు వేసిన పాత చెప్పులు, పాతబడిన బట్టలు వేసుకున్నారు. వారు తెచ్చుకున్న రొట్టెలన్నీ ఎండిపోయి బూజు పట్టి ఉన్నాయి.
Settings