యెహోషువ 3:9-11
9
యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు, “ఇక్కడకు వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినండి.
10
ఈ విధంగా సజీవుడైన దేవుడు మీ మధ్య ఉన్నారని, ఆయన కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గిర్గాషీయులను, అమోరీయులను, యెబూసీయులను మీ ముందు నుండి వెళ్లగొడతారని మీరు తెలుసుకుంటారు.
11
చూడండి, సర్వలోక ప్రభువు యొక్క నిబంధన మందసం మీకు ముందుగా యొర్దానులోకి వెళ్తుంది.
Settings