యోబు 41:18-21
18
దాని గురక కాంతి వెలుగులను విసురుతుంది; దాని కళ్లు ఉదయపు కిరణాల్లా ఉన్నాయి.
19
దాని నోటి నుండి అగ్నిజ్వాలలు ప్రవహిస్తాయి; నిప్పు కణాలు ఎగిరివస్తాయి.
20
జమ్ము మంట పై ఉడికే కుండలో నుండి పొగ వచ్చినట్లు దాని నాసికా రంధ్రాల్లో నుండి పొగ వస్తుంది.
21
దాని ఊపిరి నిప్పు కణాలను రాజేస్తుంది, దాని నోటి నుండి మంటలు బయలుదేరతాయి.
Settings