యోబు 38:4-11
4
“నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడున్నావు? నీకు వివేకము ఉంటే, నాకు జవాబు చెప్పు.
5
దాని కొలమానాన్ని ఎవరు నిర్ణయించారు? నీకు ఖచ్చితంగా తెలుసు! దాని చుట్టూ కొలత రేఖను వేసిందెవరు?
6
వేకువ చుక్కలన్ని కలిసి గానం చేస్తుంటే దేవదూతలంతా ఆనంద కేకలు వేస్తుంటే దాని పాదాలు దేనిపై మోపబడ్డాయి? దానికి మూలరాయి వేసింది ఎవరు?
8
“భూగర్భం నుండి సముద్రం పొంగి వచ్చినప్పుడు తలుపుల వెనుక దానిని మూసి ఉంచింది ఎవరు?
9
నేను మేఘాలను దానికి వస్త్రంగా చేసి కటిక చీకటిలో దానిని చుట్టిపెట్టినప్పుడు,
10
నేను దానికి హద్దులను నిర్ణయించి తలుపులు గడియలు అమర్చినప్పుడు,
11
ఇక్కడి వరకు నీవు రావచ్చు ఇంతకు మించి కాదు; నీ అహంకార అలలు ఇక్కడే ఆగిపోవాలి,
Settings