కంటెంట్‌కు వెళ్లండి
యోబు 38:16-21

సృష్టి తెలిసికొనలేని లోతుల పరిశీలన

యోబు 38:16-21
16
“నీవెప్పుడైనా సముద్రపు ఊటలలోనికి ప్రవేశించావా? సముద్రపు అడుగుభాగంలో నడిచావా?
17
మృత్యుద్వారాలు నీకు చూపించబడ్డాయా? లోతైన చీకటి ద్వారాలను నీవు చూశావా?
18
భూమి వైశాల్యం ఎంతో నీకు గ్రహించగలవా? ఒకవేళ ఇవన్నీ నీకు తెలిస్తే, నాకు చెప్పు.
19
“వెలుగు నివసించే చోటికి వెళ్లే మార్గం ఏది? చీకటి ఎక్కడ నివసిస్తుంది?
20
దానిని దాని చోటికి నీవు తీసుకెళ్లగలవా? దాని నివాస స్థలాలకు మార్గం నీవు వివేచించగలవా?
21
నీకు ఖచ్చితంగా తెలుసు, ఎందుకంటే అప్పటికే నీవు పుట్టావు! నీవు అనేక సంవత్సరాలు జీవించావు!
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options