సర్వశక్తుని అన్వేషింపలేని మహిమ
21
గాలి వీచి మేఘాలు తొలగిపోయి తేటగా ఉన్నప్పుడు ఆకాశాల్లో ప్రకాశిస్తున్న సూర్యుడిని ఏ ఒక్కరు చూడలేరు.
22
అలాగే ఉత్తర దిక్కునుండి బంగారు తేజస్సుతో ఆయన వస్తున్నారు; భీకరమైన మహిమతో దేవుడు వస్తున్నారు.
23
సర్వశక్తిమంతుడు మనకు మించినవాడు శక్తిలో ఉన్నతమైనవాడు; తన న్యాయం గొప్ప నీతిని బట్టి, ఆయన అణచివేయడు.
24
కాబట్టి ప్రజలు ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉంటారు, తమకు జ్ఞానముందని అనుకునేవారిని ఆయన లెక్కచేయరు.”
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.