యోబు 34:21-27
21
“మానవుల మార్గాలన్నిటిని ఆయన చూస్తున్నారు. వారి ప్రతి అడుగును ఆయన గమనిస్తున్నారు.
22
చెడు చేసేవారు దాక్కోవడానికి చీకటియైనా మరణాంధకారమైనా లేదు.
23
ఒకరు దేవుని ఎదుట న్యాయవిచారణలోకి రాకముందే, వానిని ఎక్కువగా విచారణ చేయనవసరం ఆయనకు లేదు.
24
విచారణలేకుండానే ఆయన బలవంతులను ముక్కలుగా చేస్తారు వారి స్థానంలో ఇతరులను నియమిస్తారు.
25
ఎందుకంటే వారి పనులెలాంటివో ఆయనకు తెలుసు, రాత్రివేళలో ఆయన వారిని పడద్రోయగా వారు నలుగగొట్టబడతారు.
26
అందరు చూస్తూ ఉండగానే వారి దుర్మార్గాన్ని బట్టి ఆయన వారిని శిక్షిస్తారు.
27
ఎందుకంటే, వారు ఆయనను అనుసరించుట మానుకున్నారు, ఆయన మార్గాల్లో దేన్ని వారు గ్రహించలేదు.
Settings