Skip to content
యోబు 30:21

యోబు 30:21

చుట్టుపక్కల సందర్భంతో వచనం 21 చూపబడుతోంది.
18
తన గొప్ప శక్తితో దేవుడు నాకు దుస్తుల్లా అవుతాడు; నా చొక్కా మెడవలె ఆయన నన్ను బంధిస్తారు.
19
ఆయన నన్ను బురదలో పడవేశారు, నేను దుమ్ము బూడిదగా అయ్యాను.
20
“దేవా, నేను మీకు మొరపెడతాను, కాని మీరు జవాబు ఇవ్వరు; నేను నిలబడతాను అయినా మీరు నన్ను ఊర్కెనే చూస్తారు.
21
నా పట్ల మీరు కఠినంగా మారారు; మీ బాహువు బలం చేత నా మీద దాడి చేస్తావు.
22
నీవు నన్ను లాక్కుని గాలి ముందు నడిపిస్తావు; నీవు తుఫానులో నన్ను విసిరివేస్తావు.
23
సజీవులందరి కోసం నియమించబడిన స్థలమైన, మరణానికి నీవు నన్ను రప్పిస్తావని నాకు తెలుసు.
24
“విరిగిన వ్యక్తి తన బాధలో సహాయం కోసం కేకలు వేసినప్పుడు ఖచ్చితంగా ఎవరూ చేయి వేయరు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options