Skip to content
యోబు 11:1-6

జోఫరు యోబు వాదనలను ఖండించుట

యోబు 11:1-6
1
అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలా జవాబిచ్చాడు:
2
“ఈ మాటలన్నిటికి జవాబు చెప్పాలి కదా? ఈ వదరుబోతు నిర్దోషిగా గుర్తించబడాలా?
3
నీ వ్యర్థమైన మాటలు విని ఇతరులు మౌనంగా ఉండాలా? నీవు ఎగతాళి చేసినప్పుడు నిన్నెవరు మందలించరా?
4
నీవు దేవునితో, ‘నా నమ్మకాలు నిర్దోషమైనవి, మీ దృష్టికి నేను పవిత్రుడను’ అని చెప్తున్నావు.
5
అయితే దేవుడు నీతో మాట్లాడాలని, ఆయన నీతో వాదించాలని,
6
జ్ఞాన రహస్యాలు ఆయనే నీకు తెలియజేయాలని నేను ఎంతో కోరుతున్నాను, ఎందుకంటే, నిజమైన జ్ఞానం నీ ఆలోచనకు మించింది. నీ పాపాల్లో కొన్నిటిని దేవుడు మరచిపోయారని తెలుసుకో.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options