యిర్మీయా 51:10-11
10
“ ‘యెహోవా మన నీతిని బయటపెట్టారు; రండి, మన దేవుడైన యెహోవా ఏమి చేశారో సీయోనులో చెప్పుదాము.’
11
“బాణాలకు పదును పెట్టండి, కవచాలను తీసుకోండి! యెహోవా మాదీయుల రాజులను రెచ్చగొట్టారు, ఎందుకంటే బబులోనును నాశనం చేయడమే ఆయన ఉద్దేశము. యెహోవా ప్రతీకారం తీర్చుకుంటారు, తన మందిరం కోసం ప్రతీకారం తీర్చుకుంటారు.