కంటెంట్‌కు వెళ్లండి
యిర్మీయా 20:7-13

యిర్మీయా విలాపం: మోసపరచబడి అపహాస్యం పొందుట

యిర్మీయా 20:7-13
7
యెహోవా! మీరే నన్ను మోసగించావు, నేను లోబడ్డాను, మీరు నాకంటే బలవంతులు, మీరే గెలిచారు, రోజంతా అందరు నన్ను చూసి నవ్వుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు.
8
నేను మాట్లాడినప్పుడెల్లా ఒకే ప్రవచనం వస్తుంది, హింస, నాశనం అంటూ ఎలుగెత్తి ప్రకటించవలసి వస్తుంది. యెహోవా మాట పలికినందుకు నాకు అవమానం, అపహాస్యం ఎదురయ్యాయి.
9
“దేవుని పేరు నేనెత్తను, ఆయన నామాన్ని బట్టి ప్రకటించను” అని అనుకుంటే, అప్పుడది నా హృదయంలో అగ్నిలా మండుతుంది. నా ఎముకల్లో మూయబడిన అగ్ని! ఎంత కాలమని ఓర్చుకోను? విసుగొస్తుంది, చెప్పకుండా ఉండలేను.
10
చాలామంది గుసగుసలాడడం విన్నాను, “అన్ని వైపుల భయం! అతన్ని ఖండించండి! అతన్ని ఖండిద్దాము.” నా స్నేహితులందరూ నేను జారిపడాలని చూస్తూ ఉన్నారు, “బహుశా అతడు మోసపోవచ్చు; అప్పుడు మనం అతనిపై విజయం సాధించి అతని మీద పగ తీర్చుకుందాము.”
11
అయితే పరాక్రమంగల బలాఢ్యుడైన యెహోవా నాకు తోడు; కాబట్టి నన్ను హింసించేవారు నిలువలేక తడబడతారు, వారు అనుకున్నది సాధించే యుక్తి లేక అవమానపాలవుతారు; వారి అవమానం ఎన్నటికీ మరవబడదు.
12
సైన్యాల యెహోవా! మీరు నీతిమంతులను పరీక్షిస్తారు, అంతరింద్రియాలను, హృదయాలను పరిశీలిస్తారు. నా వాదన మీకే అప్పగిస్తున్నాను, మీరు వారికి ఎలా ప్రతీకారం చేస్తారో నేను చూస్తాను.
13
యెహోవాను కీర్తించండి! యెహోవాను స్తుతించండి! దుష్టుని బారి నుండి దరిద్రుని ప్రాణాన్ని ఆయనే విడిపిస్తారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options