Skip to content
యిర్మీయా 12:1-6

యిర్మీయా 12:1-6

1
యెహోవా, నేను మీ ముందు ఎప్పుడు వాదన వినిపించినా మీరెప్పుడూ నీతిమంతునిగానే ఉంటారు. అయినా మీ న్యాయం గురించి నేను మీతో మాట్లాడతాను: దుష్టులు ఎందుకు అభివృద్ధి చెందుతున్నారు? నమ్మకద్రోహులంతా ఎందుకు సుఖంగా జీవిస్తున్నారు?
2
మీరు వారిని నాటారు, వారు వేర్లు పాదుకున్నారు; వారు పెరిగి ఫలిస్తున్నారు. వారెల్లప్పుడూ మీ గురించి మాట్లాడతారు కానీ వారి హృదయాలు మీకు దూరంగా ఉంటాయి.
3
అయినా యెహోవా, నేను మీకు తెలుసు; మీరు నన్ను చూస్తున్నారు, మిమ్మల్ని గురించిన నా ఆలోచనలను మీరు పరీక్షిస్తున్నారు. వధకు గొర్రెలు లాగివేయబడునట్లు వారిని లాగివేయండి! వధ దినం కోసం వారిని వేరు చేయండి!
4
ఎంతకాలం భూమి ఎండిపోయి ఉండాలి? ఎంతకాలం పొలంలో గడ్డి ఎండిపోతూ ఉండాలి? అందులో నివసించేవారు దుర్మార్గులు కాబట్టి జంతువులు, పక్షులు నశించాయి. “మనకు ఏమి జరుగుతుందో యెహోవా చూడడు” అని ప్రజలు అంటున్నారు.
5
“మీరు కాలినడకన వెళ్తున్న వారితో పరుగెడితేనే వారు నిన్ను అలసిపోయేలా చేశారు, అలాంటప్పుడు గుర్రాలతో ఎలా పోటీపడతావు? భద్రతగల దేశం అని మీరనుకునే దేశంలోనే మీరు క్షేమంగా ఉండనప్పుడు, యొర్దాను ఒడ్డున ఉన్న దట్టమైన పొదల్లో ఎలా?
6
నీ బంధువులు, నీ సొంత కుటుంబ సభ్యులు కూడా, నీకు నమ్మకద్రోహం చేశారు; వారు నీ మీద పెద్దగా అరుస్తూ మాట్లాడారు. కాబట్టి వారు నీ గురించి మంచిగా మాట్లాడినా వారిని నమ్మవద్దు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options