Skip to content
యెషయా 6:8-13

యెషయా 6:8-13

8
అప్పుడు ప్రభువు స్వరం, “నేను ఎవరిని పంపాలి? మాకోసం ఎవరు వెళ్తారు?” అని అనడం నేను విన్నాను. నేను, “నేనున్నాను. నన్ను పంపండి!” అన్నాను.
9
అందుకు ఆయన, “నీవు వెళ్లి ఈ ప్రజలతో ఇలా చెప్పు: “ ‘మీరు ఎప్పుడు వింటూనే ఉంటారు, కాని అర్థం చేసుకోరు; ఎప్పుడు చూస్తూనే ఉంటారు, కాని గ్రహించరు.’
10
వారి హృదయాలను కఠినపరచు; వారి చెవులకు చెవుడు వారి కళ్లకు గుడ్డితనం కలిగించు లేదంటే వారు తమ కళ్లతో చూసి, చెవులతో విని, హృదయాలతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందుతారు.”
11
అందుకు నేను, “ప్రభువా! ఇలా ఎంతకాలం వరకు?” అని అడిగాను. అందుకు ఆయన ఇలా జవాబిచ్చారు: “నివాసులు లేక పట్టణాలు నాశనం అయ్యేవరకు, మనుష్యులు లేక ఇల్లు పాడై విడిచిపెట్టబడే వరకు, భూమి పూర్తిగా నాశనమై బీడుగా అయ్యేవరకు,
12
యెహోవా మనుష్యులను దూరం పంపించే వరకు భూమి పూర్తిగా విడిచిపెట్టబడే వరకు.
13
దానిలో పదవ భాగం మాత్రమే విడిచిపెట్టబడినా అది కూడా నాశనమవుతుంది. అయితే మస్తకి సింధూర చెట్లు నరకబడిన తర్వాత మొద్దులు ఎలా మిగులుతాయో అలాగే పరిశుద్ధ విత్తనం మొద్దులా నేలపై ఉంటుంది.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options