యెషయా 48:6-11
6
నీవు ఈ సంగతులను విన్నావు; వాటన్నిటిని చూడు. అవి నిజమని నీవు ఒప్పుకోవా? “నీకు తెలియకుండా దాచబడిన క్రొత్త విషయాలను ఇకపై నేను నీకు చెప్తాను.
7
అవి ఇప్పుడే సృజించినవి, ఎప్పుడో చేసినవి కావు; ఈ రోజుకు ముందు నీవు వాటి గురించి వినలేదు. అప్పుడు, ‘అవును, వాటి గురించి నాకు తెలుసు’ అని నీవు చెప్పలేవు.
8
నీవు వాటి గురించి వినలేదు, అవి నీకు తెలియదు; పూర్వం నుండి నీ చెవులు తెరవబడలేదు. నీవు ఎంత ద్రోహివో నాకు తెలుసు; నీ పుట్టుక నుండి తిరుగుబాటుదారుడవు.
9
నేను నిన్ను పూర్తిగా నాశనం చేయకుండా నా నామాన్ని బట్టి నా కోపాన్ని ఆపుకున్నాను; నా కీర్తి కోసం నీ నుండి దానిని నేను నిగ్రహించుకున్నాను.
10
చూడు, నేను నిన్ను శుద్ధి చేశాను, కాని వెండిని చేసినట్లు కాదు; బాధల కొలిమిలో నిన్ను పరీక్షించాను.
11
నా కోసం, నా కొరకే, నేను ఇలా చేస్తాను. నా పేరును ఎలా అపవిత్రం చేయనిస్తాను? నేను నా మహిమను మరొకరికి ఇవ్వను.
Settings