కంటెంట్‌కు వెళ్లండి
యెషయా 48:1-5

యెషయా 48:1-5

1
“యాకోబు వారసులారా, ఇశ్రాయేలు అనే పేరుతో పిలువబడి యూదా కుటుంబం నుండి వచ్చే వారలారా వినండి, యెహోవా పేరిట ప్రమాణం చేస్తూ ఇశ్రాయేలు దేవుని వేడుకుంటూ సత్యాన్ని గాని నీతి గాని అనుసరించని వారలారా వినండి.
2
మీ గురించి మీరు పరిశుద్ధ పట్టణస్థులమని చెప్పుకుంటూ ఇశ్రాయేలు దేవుని మీద ఆధారపడుతున్నామని చెప్పుకుంటున్న మీరు వినండి, ఆయన పేరు సైన్యాల యెహోవా:
3
గతంలో జరిగిన వాటి గురించి నేను చాలా కాలం క్రితమే చెప్పాను. నా నోరు వాటిని ప్రకటించింది నేను వాటిని తెలియజేశాను; తర్వాత నేను అకస్మాత్తుగా వాటిని చేయగా అవి జరిగాయి.
4
ఎందుకంటే మీరు ఎంత మొండివారో నాకు తెలుసు; నీ మెడ నరాలు ఇనుపవని, నీ నుదురు ఇత్తడిదని నాకు తెలుసు.
5
కాబట్టి వీటి గురించి నేను చాలా కాలం క్రితం చెప్పాను; ‘నా విగ్రహం ఈ పనులను జరిగించింది నేను చెక్కిన ప్రతిమ, నేను పోతపోసిన విగ్రహం వాటిని నియమించాయి’ అని నీవు ఎప్పుడూ చెప్పకుండా ఉండేలా అవి జరగకముందే నీకు వాటిని ప్రకటించాను.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options