యెషయా 39:4-8
4
“నీ భవనంలో వారు ఏమేమి చూశారు?” అని ప్రవక్త అడిగాడు. హిజ్కియా, “నా భవనంలో ఉన్నవన్నీ చూశారు. నా ధనాగారంలో ఏదీ దాచకుండా అన్నీ వారికి చూపించాను” అన్నాడు.
5
అప్పుడు యెషయా హిజ్కియాతో ఇలా అన్నాడు, “సైన్యాల యెహోవా వాక్కు విను:
6
ఒక సమయం రాబోతుంది, నీ భవనంలో ఉన్నవన్నీ, ఈనాటి వరకు మీ పూర్వికుల కూడబెట్టినవన్నీ బబులోనుకు తీసుకెళ్తారు. ఇక్కడ ఏమీ మిగలదని యెహోవా చెప్తున్నారు.
7
నీకు పుట్టబోయే నీ సంతానంలో కొంతమంది బబులోనుకు కొనిపోబడి బబులోను రాజు యొక్క రాజభవనంలో నపుంసకలుగా అవుతారు.”
8
హిజ్కియా యెషయాతో, “నీవు చెప్పిన యెహోవా వాక్కు మంచిదే. నా జీవితకాలంలో సమాధానం సత్యం ఉంటాయి” అని అన్నాడు.
Settings