యెషయా 24:1-5
1
చూడండి, యెహోవా భూమిని పాడుచేసి నాశనం చేయబోతున్నారు; ఆయన దాని ఉపరితలాన్ని పాడుచేసి దానిలో నివసించేవారిని చెదరగొడతారు.
2
అందరికి ఒకేలా ఉంటుంది; ప్రజలకు కలిగినట్లే యాజకునికి, సేవకునికి కలిగినట్లే యజమానికి, సేవకురాలికి కలిగినట్లే యజమానురాలికి, కొనేవారికి కలిగినట్లే అమ్మేవారికి, అప్పు ఇచ్చేవారికి కలిగినట్లే అప్పు తీసుకునేవారికి, వడ్డీకి ఇచ్చేవారికి కలిగినట్లే వడ్డీకి తీసుకునేవారికి కలుగుతుంది.
3
భూమి పూర్తిగా పాడుచేయబడి పూర్తిగా దోచుకోబడుతుంది. యెహోవా ఈ మాట చెప్పారు.
4
భూమి ఎండిపోయి వాడిపోతుంది, లోకం క్షీణించి వాడిపోతుంది, ఆకాశాలు భూమితో పాటు క్షీణించిపోతాయి.
5
భూప్రజలును బట్టి భూమి అపవిత్రమైంది; వారు చట్టాలకు లోబడలేదు, వారు కట్టడలను ఉల్లంఘించారు వారు నిత్యనిబంధనను భంగం చేశారు.
Settings