యెషయా 23:6-10
6
తర్షీషుకు వెళ్లండి; సముద్ర తీర వాసులారా దుఃఖపడండి.
7
మీకు ఉల్లాసం కలిగించిన పట్టణం ఇదేనా? పాతది, ప్రాచీన పట్టణం, దూరదేశంలో నివసించడానికి సుదూర ప్రయాణం చేసింది ఇదేనా?
8
తూరు కిరీటాలు పంచిపెట్టే పట్టణం, దాని వ్యాపారులు రాకుమారులు, దాని వర్తకులు భూమి మీద ప్రసిద్ధులు, అలాంటి తూరుకు వ్యతిరేకంగా ఎవరు ఆలోచన చేశారు?
9
తనకున్న అందాన్ని బట్టి కలిగిన గర్వాన్ని అణచడానికి భూమి మీద ప్రసిద్ధులందరిని అవమానపరచడానికి సైన్యాల యెహోవా ఇలా చేశారు.
10
తర్షీషు కుమారీ, నీ దేశానికి ఇక ఓడరేవు లేదు కాబట్టి నైలు నది దాటునట్లు మీ దేశానికి తిరిగి వెళ్లు.
Settings