యెషయా 10:29-32
29
వారు మార్గం దాటి వెళ్తూ, “మేము గెబాలో రాత్రి బస చేస్తాం” అంటున్నారు. రామా వణకుతుంది; సౌలు గిబియా పారిపోతుంది.
30
గల్లీము కుమార్తె! కేకలు వేయి లాయిషా, విను! అయ్యయ్యో, అనాతోతు!
31
మద్మేనా ప్రజలు పారిపోతారు. గెబీము నివాసులు దాక్కుంటారు.
32
ఈ రోజే వారు నోబులో దిగుతారు; ఈ రోజే సీయోను కుమారి పర్వతం, యెరూషలేము కొండ వైపు వారు తమ పిడికిలి ఆడిస్తారు.
Settings