యెషయా 1:16-20
16
“మిమ్మల్ని మీరు కడుక్కుని శుభ్రం చేసుకోండి. మీ చెడు కార్యాలు నాకు కనిపించకుండా వాటిని తొలగించండి; తప్పు చేయడం మానండి.
17
సరియైనది చేయడం నేర్చుకోండి; న్యాయాన్ని వెదకండి. అణచివేయబడుతున్న వారి పక్షాన ఉండండి. తండ్రిలేనివారికి న్యాయం తీర్చండి. విధవరాలి పక్షాన వాదించండి.
18
“రండి, మనం విషయాన్ని పరిష్కరించుకుందాం” అని యెహోవా అంటున్నారు. “మీ పాపాలు రక్తంలా ఎర్రగా ఉన్నా, అవి మంచులా తెల్లగా అవుతాయి; కెంపులా ఎర్రగా ఉన్నా, అది ఉన్నిలా తెల్లగా అవుతాయి.
19
మీరు ఇష్టపడి నా మాట వింటే, మీరు భూమి ఇచ్చే మంచి పంటను తింటారు;
20
ఒకవేళ మీరు ఎదిరించి తిరుగుబాటు చేస్తే, మీరు ఖడ్గం చేత నాశనమవుతారు” యెహోవా ఈ మాట చెప్తున్నారు.
Settings