Skip to content
ఆదికాండము 35:9-13

ఆదికాండము 35:9-13

9
యాకోబు పద్దనరాము నుండి తిరిగి వచ్చాక, దేవుడు అతనికి మరలా ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించారు.
10
దేవుడు అతనితో, “నీ పేరు యాకోబు, కానీ ఇక ఎన్నడు యాకోబుగా పిలువబడవు; నీ పేరు ఇశ్రాయేలు” అని అన్నారు. కాబట్టి ఆయన అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టారు.
11
దేవుడు అతనితో అన్నారు, “నేను సర్వశక్తుడగు దేవుడను; నీవు ఫలించి, సంఖ్యాపరంగా అభివృద్ధి పొందు. ఒక జనం, జనాంగాల సమాజం నీ నుండి వస్తాయి, నీ వారసులలో నుండి రాజులు వస్తారు.
12
అబ్రాహాముకు, ఇస్సాకుకు నేనిచ్చిన దేశాన్ని, నీకు కూడా ఇస్తాను. నీ తర్వాత నీ వారసులకు కూడా ఈ దేశాన్ని ఇస్తాను.”
13
తర్వాత దేవుడు అతనితో మాట్లాడిన ఆ స్థలం నుండి ఆరోహణమయ్యారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options