ఆదికాండము 12:14-16
14
అబ్రాము ఈజిప్టుకు వచ్చినప్పుడు ఈజిప్టువారు శారాయి అందంగా ఉందని చూశారు.
15
ఫరో అధికారులు ఆమెను చూసి, ఆమె అందాన్ని ఫరో ఎదుట పొగిడారు, ఆమెను రాజభవనం లోనికి తీసుకెళ్లారు.
16
ఆమెను బట్టి అతడు అబ్రామును మంచిగా చూసుకున్నాడు, అబ్రాము గొర్రెలు, మందలు, ఆడ మగ గాడిదలు, ఆడ మగ దాసులు, ఒంటెలను ఇచ్చాడు.