Skip to content
ఎజ్రా 6:19-22

ఎజ్రా 6:19-22

19
చెర నుండి విడుదలై వచ్చినవారు మొదటి నెల పద్నాలుగవ రోజు పస్కాపండుగ చేసుకున్నారు.
20
యాజకులు, లేవీయులు తమను తాము శుద్ధి చేసుకుని పవిత్రులయ్యారు. లేవీయులు చెర నుండి విడుదలైన వారందరి కోసం, తమ బంధువులైన యాజకుల కోసం, తమ కోసం పస్కా గొర్రెపిల్లను వధించారు.
21
చెర నుండి విడుదలై వచ్చిన ఇశ్రాయేలీయులు, దేశంలో పొరుగు ప్రజల అపవిత్ర ప్రవర్తను నుండి తమను తాము ప్రత్యేకించుకొని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను కొలిచే వారంతా కలిసి పస్కాను తిన్నారు.
22
ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పనిలో సహకరించేలా యెహోవా అష్షూరు రాజు హృదయాన్ని మార్చి వారికి సంతోషాన్ని కలిగించినందుకు వారు ఏడు రోజులు పులియని రొట్టెల పండుగను ఆనందంతో జరుపుకున్నారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options