పండుగలలో ప్రజల రాకపోకలు
9
“ ‘దేశ ప్రజలు నియమించబడిన పండుగల్లో యెహోవా సన్నిధికి ఆరాధించడానికి వచ్చినప్పుడు, ఉత్తర ద్వారం నుండి వచ్చేవారు దక్షిణ ద్వారం నుండి బయటకు వెళ్లాలి; దక్షిణ ద్వారం నుండి వచ్చేవారు ఉత్తర ద్వారం నుండి బయటకు వెళ్లాలి. ఎవరూ తాము వచ్చిన ద్వారం గుండా తిరిగి వెళ్లకుండా ప్రతిఒక్కరు తిన్నగా బయటకు వెళ్లాలి.
10
యువరాజు వారి మధ్య ఉండి, లోపలికి వెళ్లి వారితో పాటు బయటకు వెళ్లాలి.
11
పండుగల్లో, నియమించబడిన సమయాల్లో, భోజనార్పణగా ఎద్దుతో పాటు ఒక ఏఫా పిండిని, పొట్టేలుతో పాటు ఒక ఏఫా పిండిని, గొర్రెపిల్లలతో పాటు తన శక్తికొలది పిండిని అర్పించాలి. ప్రతి ఏఫా పిండితో పాటు ఒక హిన్ నూనె అర్పించాలి.
12
“ ‘యెహోవాకు స్వేచ్ఛార్పణమైన దహనబలి గాని, సమాధానబలి గాని యువరాజు అర్పించేటప్పుడు అతని కోసం తూర్పు వైపు ద్వారం తలుపులు తెరవాలి. సబ్బాతు దినాన అర్పించునట్లుగానే దహనబలిని సమాధానబలిని అర్పించి వెళ్లిపోవాలి. అతడు వెళ్లిన తర్వాత ద్వారం తలుపులు మూసివేయాలి.
Settings