Skip to content
యెహెజ్కేలు 45:1-5

యెహెజ్కేలు 45:1-5

1
“ ‘మీరు భూమిని వారసత్వంగా కేటాయిస్తున్నప్పుడు, మీరు భూమి నుండి ఒక భాగాన్ని యెహోవాకు ప్రతిష్ఠించాలి. ఆ భాగం పొడవు 25,000 మూరలు, వెడల్పు 20,000 మూరలు ఉండాలి; ఆ స్థలమంతా ప్రతిష్ఠితమవుతుంది.
2
దానిలో పరిశుద్ధస్థలం కోసం 500 మూరల చతురస్రాకార స్థలాన్ని కేటాయించాలి దాని చుట్టూ అన్నివైపులా 50 మూరల మైదానం ఉండాలి.
3
ఈ స్థలం నుండి 25,000 మూరల పొడవు 10,000 మూరల వెడల్పు గల భూమి కొలవాలి. దానిలో అతి పరిశుద్ధ స్థలమైన పరిశుద్ధస్థలం ఉంటుంది.
4
యెహోవాకు పరిచర్య చేయడానికి ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేసే యాజకులకు కేటాయించిన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలమవుతుంది. అది వారి ఇళ్ళకు స్థలంగా పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలంగా ఉంటుంది.
5
25,000 మూరల పొడవు 10,000 మూర వెడల్పు గల స్థలం మందిరంలో సేవచేసే లేవీయులకు స్వాస్థ్యంగా ఇరవై గదులు ఉన్న వారి నివాస స్థలంగా ఉంటుంది.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options