యెహెజ్కేలు 44:7-9
7
మీరు చేసిన అసహ్యమైన ఆచారాలతో పాటు హృదయానికి శరీరానికి సున్నతిలేని విదేశీయులను నా పరిశుద్ధ స్థలంలోనికి తీసుకువచ్చి మీరు నాకు ఆహారాన్ని క్రొవ్వును రక్తాన్ని అర్పించి నా మందిరాన్ని అపవిత్రపరచి నా నిబంధనను భంగం చేశారు.
8
మీకు అప్పగించిన నా పవిత్ర వస్తువుల బాధ్యతను మీరు నెరవేర్చకుండా నా పరిశుద్ధస్థలం యొక్క బాధ్యతను ఇతరులకు అప్పగించారు.
9
ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: హృదయానికి శరీరానికి సున్నతిలేని విదేశీయులుగా ఇశ్రాయేలీయుల మధ్య నివసించే వారిలో ఎవరూ నా పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించకూడదు.
Settings