కంటెంట్‌కు వెళ్లండి
యెహెజ్కేలు 43:7-12

యెహోవా తన నివాసమును స్థాపించుట

యెహెజ్కేలు 43:7-12
7
ఆయన ఇలా అన్నారు: “మనుష్యకుమారుడా, ఇది నా సింహాసనం, నా పాదాలు పెట్టుకునే స్థలము. ఇక్కడే నేను ఇశ్రాయేలీయుల మధ్య శాశ్వతంగా నివసిస్తాను. ఇశ్రాయేలు ప్రజలు తమ వ్యభిచారం ద్వారా, వారి రాజుల మరణ సమయంలో వారి అంత్యక్రియల అర్పణల ద్వారా నామాన్ని వారు గాని వారి రాజులు గాని అపవిత్రం చేయరు.
8
నాకు వారికి మధ్య గోడ మాత్రమే ఉంచి, వారు నా గుమ్మం ప్రక్కన తమ గుమ్మాలను, నా గడపల ప్రక్కన తమ గడపలను కట్టి, తమ అసహ్యమైన ఆచారాలతో వారు నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రం చేశారు, కాబట్టి నేను కోపంతో వారిని నాశనం చేశాను.
9
ఇప్పటికైనా వారు తమ వ్యభిచారాన్ని తమ రాజుల అంత్యక్రియల అర్పణలను నా దగ్గరి నుండి దూరంగా తీసివేసినప్పుడు, నేను వారి మధ్య శాశ్వతంగా నివసిస్తాను.
10
“మనుష్యకుమారుడా, ఇశ్రాయేలు ప్రజలు తమ పాపాలకు సిగ్గుపడేలా మందిరాన్ని గురించి వారికి వివరించండి. వారు దాని పరిపూర్ణతను పరిగణలోనికి తీసుకుని,
11
వారు చేసిన పనులన్నిటికి వారు సిగ్గుపడితే, వారికి ఆలయ రూపకల్పనను గురించి అనగా దాని అమర్చిన విధానం, దానిలోనికి వచ్చే బయటకు వెళ్లే ద్వారాల గురించి, దాని మొత్తం రూపకల్పన గురించి, దాని అన్ని నియమాలు, చట్టాలను తెలియజేయాలి. వారు దాని రూపకల్పన పట్ల నమ్మకంగా ఉండగలిగేలా, వారు దాని నియమానలన్నింటినీ అనుసరించేలా చేయడానికి వాటిని వారి ముందు వ్రాసిపెట్టాలి.
12
“ఇది ఆలయ నియమం: పర్వతం పైన ఉన్న పరిసర ప్రాంతాలన్నీ అత్యంత పవిత్రంగా ఉంటాయి. ఆలయ ధర్మం అలాంటిది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options