యెహెజ్కేలు 36:23-28
23
మీ మూలంగా ఇతర ప్రజల్లో అవమానపరచబడుతున్న నా గొప్ప పేరు ఎంత పరిశుద్ధమైనదో మీకు చూపిస్తాను. వారి కళ్ళెదుట మీ ద్వారా నా పరిశుద్ధతను వెల్లడి చేసినప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
24
“ ‘నేను మిమ్మల్ని ఇతర ప్రజల్లో నుండి బయటకు తీసుకువస్తాను; దేశాలన్నిటి నుండి మిమ్మల్ని సమకూర్చి మీ స్వదేశానికి తిరిగి తీసుకువస్తాను.
25
నేను మీమీద శుద్ధ జలాన్ని చిలకరిస్తాను, మీరు శుద్ధులవుతారు; మీ విగ్రహాల నుండి, అపవిత్రతలన్నిటి నుండి నేను మిమ్మల్ని శుద్ధి చేస్తాను.
26
నేను మీకు నూతన హృదయాన్ని ఇచ్చి, మీలో నూతనమైన ఆత్మను ఉంచుతాను. మీలోని రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను పెడతాను.
27
నా ఆత్మను మీలో ఉంచి, నా శాసనాలను అనుసరించి నా ధర్మశాస్త్రాన్ని పాటించేవారిగా మిమ్మల్ని చేస్తాను.
28
అప్పుడు మీ పూర్వికులకు నేనిచ్చిన దేశంలో మీరు నివసిస్తారు. మీరు నా ప్రజలుగా ఉంటారు, నేను మీకు దేవుడనై ఉంటాను.
Settings