యెహెజ్కేలు 34:18-22
18
మంచి పచ్చికబయళ్లను తింటే సరిపోదా? మిగిలిన పచ్చికబయళ్లను కాళ్లతో త్రొక్కాలా? మీరూ స్వచ్ఛమైన నీరు త్రాగితే సరిపోదా? మీ పాదాలతో మిగిలిన నీటిని బురదమయం చేయాలా?
19
మీ కాళ్లతో త్రొక్కింది నా మంద మేయాలా? కాళ్లతో బురద చేసిన నీళ్లను నా గొర్రెలు త్రాగాలా?
20
“ ‘ప్రభువైన యెహోవా వారికి చెబుతున్న మాట ఇదే: క్రొవ్విన గొర్రెలకు బక్కచిక్కిన గొర్రెలకు మధ్య నేనే తీర్పు తీరుస్తాను.
21
మీరు కొమ్ములతో పొడుస్తూ, భుజంతో ప్రక్కలతో తోస్తూ బలహీనమైన గొర్రెలన్నిటిని తరిమికొడుతున్నారు కాబట్టి,
22
నేను నా గొర్రెలను కాపాడతాను, ఇకపై అవి దోచుకోబడవు. గొర్రెకు మధ్య నేను తీర్పు తీరుస్తాను.
Settings