Skip to content
యెహెజ్కేలు 32:24-32

యెహెజ్కేలు 32:24-32

24
“సమాధి చుట్టూ ఏలాము దాని అల్లరిమూకలు ఉన్నాయి. వారందరూ చంపబడ్డారు, ఖడ్గంతో కూలారు. సజీవుల దేశంలో భయాన్ని వ్యాపింపజేసిన వారంతా సున్నతి పొందని వారిగా పాతాళంలోకి దిగివెళ్లే వారితో పాటు తమ అవమానాన్ని భరిస్తున్నారు.
25
చనిపోయినవారి మధ్య, దాని సమాధి చుట్టూ ఉన్న దాని అల్లరిమూకలకు దానికి పడక ఏర్పాటు చేయబడింది. వారందరూ సున్నతి లేకుండా ఖడ్గంతో చచ్చారు. సజీవుల దేశంలో భయాన్ని వ్యాపింపజేశారు కాబట్టి పాతాళానికి దిగివెళ్లే వారితో తమ అవమానాన్ని భరిస్తున్నారు; చనిపోయినవారి మధ్య వారు పడి ఉన్నారు.
26
“మెషెకు, తుబాలు తమ సమాధుల చుట్టూ తమ అల్లరిమూకలతో పాటు అక్కడ ఉన్నారు. వారంతా సున్నతిలేనివారు, ఖడ్గంతో చంపబడ్డారు ఎందుకంటే సజీవుల దేశంలో వారు భయాన్ని వ్యాపింపజేశారు.
27
అయితే వారు సున్నతిలేని వారిలో పతనమైన యోధులతో పడుకోరు, వారు యుద్ధ ఆయుధాలతో పాటు పాతాళానికి దిగివెళ్లి, తమ ఖడ్గాలను వారి తలల క్రింద, వారి డాళ్లు వారి ఎముకల మీద పెట్టుకుని పడుకుంటారు; వీరు సజీవుల దేశంలో భయాన్ని పుట్టించారు కాబట్టి వీరి దోషం వీరి ఎముకలకు తగిలింది.
28
“ఫరో, నీవు కూడా సున్నతిలేనివారి మధ్య కత్తితో చంపబడినవారితో పాటు పడుకుంటావు.
29
“అక్కడ ఎదోము, దాని రాజులు యువరాజులు ఉన్నారు; వారికి శక్తి ఉన్నప్పటికీ, వారు ఖడ్గం చేత చంపబడినవారితో పాటు పడి ఉన్నారు. వారు సున్నతి పొందని వారితో, గొయ్యిలో దిగే వారితో పడుకుంటారు.
30
“ఉత్తర ప్రాంత అధిపతులందరు, అలాగే సీదోనీయులందరు అక్కడ ఉన్నారు; వారు తమ శక్తి వల్ల భీభత్సం సృష్టించినప్పటికీ చంపబడినవారితో దిగివెళ్లి అవమానానికి గురయ్యారు. వారు ఖడ్గం చేత చంపబడినవారితో సున్నతి పొందని వారిగా పడి ఉన్నారు, పాతాళానికి దిగివెళ్లే వారితో తమ అవమానాన్ని భరిస్తున్నారు.
31
“ఖడ్గంతో చంపబడిన ఫరో అతని సైన్యమంతా వారిని చూసి తమ అల్లరిమూకలన్నిటిని బట్టి ఓదార్పు పొందుతారు అని ప్రభువైన యెహోవా ప్రకటించారు.
32
సజీవుల దేశంలో భయాన్ని వ్యాపింపజేసేలా చేశాను కాబట్టి ఫరో అతనితో పాటు అతని సైన్యం సున్నతిలేని వారితోనూ ఖడ్గం చేత హతులైనవారితోనూ పడి ఉంటారు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options