యెహెజ్కేలు 28:9-14
9
నిన్ను చంపేవారి ఎదుట “నేను దేవుడిని” అని చెప్తావా? నిన్ను చంపేవారి చేతుల్లో నీవు మనిషివే కాని దేవుడవు కావు.
10
సున్నతిలేనివారు చనిపోయినట్లు నీవు విదేశీయుల చేతిలో చస్తావు అని చెప్పింది నేనే అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”
11
యెహోవా వాక్కు నాకు వచ్చి:
12
“మనుష్యకుమారుడా, తూరు రాజు గురించి విలాప గీతం పాడి అతనితో ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘నీవు పరిపూర్ణతకు ముద్రగా, జ్ఞానంతో నిండి ఎంతో అందంగా ఉండేవాడివి.
13
దేవుని తోటయైన, ఏదెనులో నీవు ఉండేవాడివి; ప్రతి ప్రశస్తమైన రాయితో నీవు అలంకరించబడ్డావు. మాణిక్యం, గోమేధికం, సూర్యకాంతమణి, కెంపు, సులిమాని, మరకతం, నీలమణి, పద్మరాగం, అన్ని బంగారంతో నీకోసం తయారుచేయబడ్డాయి; నీవు సృజించబడిన రోజున అవి నీకోసం సిద్ధపరచబడ్డాయి.
14
అభిషేకం పొందిన కావలి కెరూబులా నేను నిన్ను నియమించాను దేవుని పరిశుద్ధ పర్వతం మీద నీవున్నావు. నీవు కాలుతున్న రాళ్ల మధ్య నడిచావు.
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.