యెహెజ్కేలు 25:2-7
2
“మనుష్యకుమారుడా, అమ్మోనీయుల వైపు నీ ముఖాన్ని త్రిప్పి వారి గురించి ప్రవచించు.
3
వారితో ఇలా చెప్పు, ‘అమ్మోనీయులారా, ప్రభువైన యెహోవా మాట వినండి. ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: నా పరిశుద్ధాలయం అపవిత్రపరచబడినప్పుడు, ఇశ్రాయేలు దేశం పాడైపోతున్నప్పుడు, యూదా వారు బందీలుగా వెళ్తున్నప్పుడు మీరు “ఆహా!” అన్నారు.
4
కాబట్టి నేను మిమ్మల్ని తూర్పు ప్రజలకు స్వాస్థ్యంగా అప్పగిస్తాను. వారు గుడారాలు వేసుకుని మీ మధ్య నివసిస్తారు; వారు మీ పండ్లు తిని మీ పాలు త్రాగుతారు.
5
రబ్బా పట్టణాన్ని ఒంటెల శాలగా మారుస్తాను. అమ్మోనీయుల దేశాన్ని గొర్రె దొడ్డిగా చేస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.
6
ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: మీరు చప్పట్లు కొట్టి కాళ్లతో నేలను తన్ని ఇశ్రాయేలు దేశానికి జరిగిన దానిని గురించి మీ మనస్సులోని దురుద్దేశంతో సంతోషించారు.
7
అందుకే నేను మీకు విరోధినై మిమ్మల్ని ప్రజలకు దోపుడు సొమ్ముగా అప్పగిస్తాను. ఇతర ప్రజల్లో ఉండకుండా నేను మిమ్మల్ని తుడిచివేస్తాను, దేశాల నుండి నిర్మూలిస్తాను. నేను మిమ్మల్ని నాశనం చేసినప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ”
Settings