యెహెజ్కేలు 19:10-14
10
“ ‘నీ తల్లి నీ ద్రాక్షతోటలో నీటి ప్రక్కన నాటబడిన ద్రాక్షవల్లిలాంటిది; నీరు సమృద్ధిగా ఉన్నందున అది ఫలించి అనేక కొమ్మలతో నిండి ఉంది.
11
పాలకుల రాజదండాన్ని చేయడానికి తగిన బలమైన కొమ్మలు దానికున్నాయి. అది మేఘాలను తాకే అంతగా పైకి పెరిగింది దానికున్న అనేక కొమ్మలతో ఏపుగా పెరిగింది.
12
అయితే మహా కోపంతో అది పెరికి వేయబడి నేల మీద పారవేయబడింది. తూర్పు గాలి వీచగా దాని పండ్లు వాడిపోయాయి; బలమైన దాని కొమ్మలు అగ్నిలో పడి కాలిపోయాయి.
13
ఇప్పుడది అరణ్యంలో పూర్తిగా ఎండిపోయిన నీళ్లు లేని ఎడారిలో నాటబడింది.
14
దాని కొమ్మల్లో నుండి అగ్ని వ్యాపించి దాని పండ్లను కాల్చివేసింది. పాలకుల రాజదండాన్ని చేయడానికి తగిన బలమైన కొమ్మ ఒక్కటి కూడా మిగల్లేదు.’ ఇదే విలాప వాక్యం; దీనినే విలాప గీతంగా పాడతారు.”
Settings