నిర్గమకాండము 39:10-14
10
దానిపై నాలుగు వరుసల ప్రశస్తమైన రాళ్లు పొదిగారు. మొదటి వరుసలో మాణిక్యం, గోమేధికం, మరకతం;
11
రెండవ వరుసలో పద్మరాగం, నీలమణి, పచ్చ;
12
మూడవ వరుసలో గారుత్మతం, యష్మురాయి, ఇంద్రనీలం;
13
నాలుగవ వరుసలో పుష్యరాగం, లేతపచ్చ రాళ్లు, సూర్యకాంతమణి ఉన్నాయి. వాటిని బంగారు చట్రంలో అమర్చారు.
14
ఇశ్రాయేలు కుమారుల పేర్లకు ఒక్కొక్కటి చొప్పున పన్నెండు రాళ్లు ఉన్నాయి, ప్రతిదీ వారిలో ఒక్కొక్క పేరు చొప్పున పన్నెండు గోత్రాల పేర్లు ముద్రలా చెక్కబడ్డాయి.
Settings