కంటెంట్‌కు వెళ్లండి
ఎస్తేరు 8:9-14

ప్రతిఆజ్ఞ వ్రాయబడుట

ఎస్తేరు 8:9-14
9
సీవాను అనే మూడవ నెల ఇరవై మూడవ రోజున రాజ్య లేఖికులు రు. వారు మొర్దెకై ఆదేశాల ప్రకారం, ఇండియా నుండి కూషు వరకు ఉన్న మొత్తం నూట ఇరవై ఏడు సంస్థానాలలో ఉన్న యూదులకు, సంస్థానాధిపతులకు, ప్రభుత్వ అధికారులకు, ప్రముఖులకు వారి వారి భాషలో లిపిలో, యూదులకు కూడా వారి సొంత లిపిలో భాషలో తాకీదులు వ్రాశారు.
10
మొర్దెకై రాజైన అహష్వేరోషు పేరిట తాకీదులను వ్రాయించి రాజు ఉంగరంతో ముద్రించి, రాజు సేవకు ప్రత్యేకంగా ఉపయోగించే గుర్రాలపై వేగంగా స్వారీ చేసే వార్తాహరులతో వాటిని పంపాడు.
11
రాజు ఆదేశం, యూదులు ప్రతి పట్టణంలో తమను తాము కాపాడుకునే హక్కు కలిగించింది; వారి మీద, వారి స్త్రీల మీద, పిల్లల మీద దాడి చేసే ఏ జాతి వారినైనా, ఏ సంస్థానం వారినైనా, వారు నాశనం చేయవచ్చు, చంపవచ్చు, నిర్మూలించవచ్చు, వారి శత్రువుల ఆస్తిని కొల్లగొట్టవచ్చు.
12
రాజైన అహష్వేరోషు సంస్థానాలన్నిటిలో యూదులు ఇలా చేయడానికి నియమించబడిన రోజు అదారు నెల అనే పన్నెండవ నెల, పదమూడవ రోజు.
13
ఆ రోజున యూదులు తమ శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధపడేలా ఈ తాకీదుకు ప్రతులు వ్రాయించి అన్ని సంస్థానాలలో ఉన్న ప్రజలందరికి పంపాలని ఆజ్ఞ ఇవ్వబడింది.
14
రాజాజ్ఞ ప్రకారం వార్తాహరులు, రాజ్య గుర్రాల మీద వేగంగా స్వారీ చేస్తూ వెళ్లి, ఆ శాసనాలను షూషను కోటలో అందజేశారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options